కేశంపేట, నవంబర్ 02 : తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని షాద్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ, తూర్పుగడ్డతండా, దత్తాయపల్లి, ఇప్పలపల్లి, దేవునిగుడితండా, పోమాల్‌పల్లి, కొండారెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం అంజయ్యయాదవ్‌తో పాటు నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంజయ్యయాదవ్‌కు ఆయా గ్రామాల్లో మహిళలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
ఉమ్మడి పాలకులు తెలంగాణ సంపదను దోచుకున్నారని, నేడు తెలంగాణలో మన సంపదను ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు విష్ణువర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, శంకర్, కృష్ణయ్య, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు రాంబల్‌నాయక్, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, పల్లె నర్సింగ్‌రావు, యాదగిరిరావు, శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నర్సింహ, రాంచందర్‌నాయక్, వేణుగోపాలాచారి పాల్గొన్నారు.
కొత్తూరు : కారు గుర్తు గెలిస్తేనే మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అక్కివేని గూడ, ఫాతిమాపూర్లలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తిరుగుతూ ప్రజలకు వివరించారు. రూ. 110 కోట్లతో మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తి కావాలంటే అంజయ్యయాదవ్ తిరిగి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలువాలని అన్నారు.
అదేవిధంగా మండలంలోని గూడరులో సర్పంచ్ బ్యాగరి సత్తయ్య, మల్లాపూర్ తండాల్లో మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గోవిందరెడ్డి, బ్యాగరి యాదయ్య, శివకుమార్, లక్ష్మయ్యయాదవ్, గోవిందర్రెడ్డి, శంకర్ నర్సింహీ, శివరాజ్, డా. ప్రకాశ్, జోగు కృష్ణ, జంగగళ్ల ప్రవీణ్, జంగగళ్ల శివకుమార్, రవినాయక్, గుండు సురేశ్, జగన్, మల్లేశ్, అశోక్, లింగంగౌడ్, రవినాయక్, లోబ్యానాయక్, సుందర్నాయక్, సరసింహారెడ్డి, కృష్ణయాదవ్, మోహన్‌నాయక్, ప్రవీణ్, శ్రీను, సాయికుమార్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మున్సిపాలిటీలోని 10వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించారు. కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ నాయకుల మోస పూరితమైన మాటలను ఎవరూ నమ్మవద్దని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జూపల్లి శంకర్, చెట్ల నర్సింహ, శేఖర్, రమేశ్, శ్రీను, అశోక్, యాదగిరి, రాఘవేందర్‌రెడ్డి, రాజు, రాఘవేందర్, మహేశ్, శివ, దిలీప్, శరత్, సాయి పాల్గొన్నారు.
భారీ మోజార్టీతో గెలువాలని ప్రత్యేక పూజలు
షాద్‌నగర్‌టౌన్ : ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలువాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ పట్టణంలోని రైతుకాలనీ కోట మైసమ్మతల్లి దేవాలయంలో పూజలు చేశారు. ప్రజలంతా ఓటు వేసే సమయంలో ఆలోచన చేసుకోవాలని, ఎవరూ మంచి చేశారో ఒకసారి గుర్తు చేసుకుని ఓటు వేయాలన్నారు.
నందిగాయ : నందిగామ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వవరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
చేవెళ్ల : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారమవుతుందని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. చేవెళ్లల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృది,్ధ ఎన్నికల మ్యానిఫెస్టోను ఇంటింటికి తిరిగి వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యనారాయణ చారి, నాయకులు రాజిరెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.