మోమిన్‌పేట, జనవరి 6: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి దిశగా అడు గులేస్తున్నాయి. మండలంలోని దేవరంపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి,పాలకవ ర్గం సభ్యులు నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు.గ్రామంలో 365 ఇండ్లు ఉండగా 1316 మంది జనాభా ఉంది.గ్రామంలో సుమారు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామానికి కొత్తకళ సంతరించుకుంది. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మించారు. రూ.13 లక్షలతో నూతనంగా సీసీ రోడ్డు వేశారు. రూ.15 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు చేశారు. రూ. 10 లక్షలతో పాఠశాలకు ప్రహరీ, ఇతర సౌకర్యాలు కల్పించారు. ప్రధాన రోడ్డు నుంచి గ్రామంలోనికి వచ్చే రోడ్డుకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు రూ. మూడు లక్షలు ఖర్చు చేశారు. అలాగే రూ.15 లక్షలతో మిషన్ భగీరథ ట్యాంకులు, ఇంటిటికీ నల్లాలు ఏర్పాటు చేసి గ్రామంలో నీటి కష్టాలను తీర్చారు. ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది.ప్రకృతి వనంలో పండ్లు, పువ్వులు,ఔషధ గుణాలు మొక్కలు పెంచుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి ప్రతి రోజు పంచాయతీ సిబ్బంది మొక్కలు నీరు అందించడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. గ్రామంలో వీధి వీధికి ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామం రాత్రిపూట జిగేల్ మంటుంది. ప్రతి రోజు పారిశుధ్య కార్మికులు తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు తయారుచేస్తూ మొక్కలకు ఉపయోగిస్తున్నారు.
పల్లె ప్రగతితోనే గ్రామాభివృద్ధి
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామంలో కొత్తకళ సంతరించుకున్నది. ప్రభుత్వం కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకుంటూ వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇప్పటికే గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, ప్రకృతి వనం, సీసీ రోడ్డు, అండర్‌డ్రైనేజీ, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. ప్రతి రోజు పారిశుధ్య పనులు నిర్వహిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా మల్చుకుంటున్నాము.గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాను.