నేడు, రేపు మంత్రుల పర్యటన
జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నేడు, రేపు మం త్రులు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరంలోని మార్కెట్షెడ్, దుకాణ సముదాయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభిస్తారు.
- నేడు మంత్రి సత్యవతి రాథోడ్ మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటన
- రేపు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్‌రావు
- మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు
రంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నేడు, రేపు మం త్రులు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరంలోని మార్కెట్షెడ్, దుకాణ సముదాయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం 9.45 గంటలకు ఉప్పుగడ్డతండాలో రూ.4.20కోట్లతో నిర్మించిన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభించడంతోపాటు రూ.కోటితో నిర్మించనున్న బంజారాభవన్ నిర్మాణానికి.. అలాగే మరో రూ.కోటితో నిర్మించనున్న సేవాలాల్ మహారాజ్ ఆల య నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 10.30 గంటలకు మన్సాన్పల్లి గ్రామంలో ఇండ్ల పట్టాలను పంపి ణీ చేశాక కుల సంఘాల భవన నిర్మాణ పనులకు భూ మిపూజ చేసి భారీ బహిరంగ సభలో వారు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానికంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం తోపాటు 2.25 గంటలకు మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్‌లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంటలకు ముడిమ్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాక చేవెళ్ల గ్రామంలోని వీరయ్య ఫంక్షన్ హాల్లో ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. చివరగా శంకరపల్లి మండలంలోని మోకిల గ్రా మంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రులు ప్రారంభిస్తారు.
1న మెడికల్ కాలేజీకి శంకుస్థాపన
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు మంత్రి సబితాఇంద్రారెడ్డి తో కలిసి అక్టోబర్ 1న శంకుస్థాపన చేయనున్నారు. కాలేజీ నిర్మాణానికి ఇటీవలె ప్రభుత్వం పరిపాలనాఅనుమతులను మంజూరుచేసి రూ.176 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో కాలేజీ, ల్యాబ్‌లు, సెమినార్ హాళ్లు, హాస్టల్ భవన నిర్మాణం, ఇతర వసతులను కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రి హరీశ్‌రావు జల్పల్లి మున్సి పాలిటీలో నిర్మించనున్న 12 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కు సాయిరాంకాలనీ వద్ద శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11.30 గంటలకు కందుకూరుకు బయలుదేరి వెళ్లి 450 పడకలతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి అక్కడ జరుగనున్న బహిరంగ సభ లో మంత్రులు పాల్గొంటారు. మంత్రుల పర్యటనను జయప్రదం చేయాలని మంత్రి సబితారెడ్డి కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

