బడంగ్‌పేట, మే 21 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడ ఇందిరానగర్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో పాత కొత్త భేదం లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయడానికి ప్రతీ కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలన్నారు. ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా అర్హులకు పథకాలు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.
మహేశ్వరం : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు దయాల శ్రీను ఆధ్వర్యంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెసు, బీజేపీల శ్రేణులు బీఆర్ఎస్లోకి చేరుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీల సీనియర్ నాయకులు ఆవ మల్లేశ్, గూడ సురేశ్, దండుగుల హరీశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కేసీ తండా సర్పంచ్ మోతీలాల్ నాయక్, హర్షగూడ ఎంపీటీసీ విజయ్‌కుమార్, ఉపసర్పంచ్ రవినాయక్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాములు, గ్రామ శాఖ అధ్యక్షురాలు అలివేలు ఉన్నారు.