ప్రగతి పరుగు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీసీపీ సాయి శ్రీ సారథ్యంలో జరిగిన 5కే రన్ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
- అట్టహాసంగా తెలంగాణ రన్
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ 1 : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
- మీర్‌పేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి
- వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్
- పోలీసుల సేవలను ప్రశంసించిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీసీపీ సాయి శ్రీ సారథ్యంలో జరిగిన 5కే రన్ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల్లో నిర్వహించిన తెలంగాణ రన్లో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర గొప్పదని, శాంతి భద్రతల విషయంలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని వారు అభినందించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
బడంగ్‌పేట, జూన్ 12 : దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్ స్థానంలో ఉన్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం మీర్‌పేట డీసీపీ సాయిశ్రీ సారథ్యంలో నిర్వహించిన 5కే రన్ అట్టహాసగా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఊపి రన్‌ను ప్రారంభించారు. మూడు రంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బాలాపూర్ చౌరస్తాలోని మంత్రాల చెరువు వరకు నిర్వహించిన 5కే రన్‌కు విశేష స్పందన వచ్చింది. యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. దారి మొత్తం జనంతో నిండిపోయింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసుల పనితీరును చూసి దేశం గర్విస్తున్నదన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీసులకు ప్రభుత్వం నూతన వాహనాలను సమకూర్చిందన్నారు. షీటీమ్స్ బృందాలు మహిళలకు రక్షణ కవచంగా పని చేస్తున్నాయని.. మహిళలకు ఎలాంటి సమస్యలొచ్చినా క్షణాల్లో ఆ బృందాలు అక్కడ వాలిపోతున్నాయన్నారు. దేశానికే షీటీమ్స్ ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ కిరణ్‌కుమార్, మీర్‌పేట మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్యాబీరప్ప, బీఆర్ఎస్ బడంగ్‌పేట మండలాధ్యక్షుడు రాంరెడ్డి, మీర్‌పేట పార్టీ అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి , కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

