మన పధకాలు దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్‌తోనే సమర్థవంతమైన పాలన సాధ్యమని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు.
- బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యేఅభ్యర్ధి, మంత్రి సబితాఇంద్రారెడ్డి
- ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో
- మహిళలు బోనాలు, హారతులతో ఘన స్వాగతం
ఆర్కేపురం, నవంబర్ 26 : సీఎం కేసీఆర్‌తోనే సమర్థవంతమైన పాలన సాధ్యమని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు బోనాలు, హారతులు ఇస్తూ పూలతో ఘన స్వాగతం పలికారు. జై సబితమ్మ, కారు గుర్తుకే మన ఓటు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటికే అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు సమాజంలో అనేక మార్పులకు కారణమయ్యాయన్నారు.

దేశంలోనే మొదటిసారి రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. రైతు బీ మా స్ఫూర్తితో బతుకుకు ఆర్థిక బరోసా కల్పిస్తూ 93 లక్షల మందికి 5లక్షల బీమా సౌకర్యం, పేద మహిళలకు రూ.3వేలు ఆర్థిక సహాయం, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌లాంటి అనేక పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెసి ఎమ్మెల్యేగా తనను, సీఎంగా కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలను అమలు చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, గొడుగు శ్రీనివాస్, కొండ్ర శ్రీనివాస్, ముప్పిడి లింగస్వామిగౌడ్, సిద్దగోని వెంకటేశ్‌గౌడ్, పెంబర్తి శ్రీనివాస్, సాజీద్, నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షురాలు పటేల్ సునితారెడ్డి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లిక్క ఊర్మిలారెడ్డి, చామల శైలజారెడ్డి, మారం సుజాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

