Bollywood Actor Varun Dhawan | బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ తన జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సినిమాల సక్సెస్‌లు, బాక్సాఫీస్ రికార్డుల కంటే తన జీవితంలో ఇదే అత్యంత గొప్ప విజయంగా భావిస్తూ ఆయన ఒక వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ సుందరమైన క్షణాలను తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటూ, కొత్తగా కొన్న భూమిలో నిలబడి వర్షపు వాతావరణంలో ఛాయ్, బిస్కెట్లు తింటున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ, తాను ఒక ఫార్మ్‌ను సొంతం చేసుకున్నానని, ఈ వాతావరణంలో ఇక్కడ నిలబడి టీ తాగడం తనను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోందని, ఇది తన జీవితంలోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని సంతోషంగా చెప్పారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు వరుణ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాడని కొందరు ప్రశంసించగా, గ్రామీణ వాతావరణంలో ఉండే ప్రశాంతతే వేరని మరికొందరు కామెంట్ చేశారు.