కొల్చారం : కాంగ్రెస్ ( Congress ) పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తన కుటుంబం పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS ) సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్( Arige Ramesh ) అన్నారు. మెదక్ మండలం కొల్చారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
సర్పంచ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తన కుటుంబం పై 11 మార్లు కలెక్టర్కు నిరాధారమైన ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. ఆంజనేయులు గౌడ్ తనను కబ్జా కోరు అన్నారని, తన భార్య మద్యం అమ్ముతుందని ఆరోపించారని ఆవేదన చెందారు. స్థాయి మరిచి పలు సందర్భాల్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని అనుచిత పదజాలంతో దూషించారని మండిపడ్డారు. తనను కబ్జా కోరుగా నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అరిగే రమేష్ అన్నారు. ఆంజనేయులు గౌడ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.