రంగారెడ్డి, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు జరిగే ధర్నాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆమె బషీర్‌బాగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి ధరలు పెంచి రైతు లు, సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. ఎరువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను రెట్టింపు చేశారన్నారు. నల్ల చట్టాలను తెచ్చి దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు కారణమయ్యారని ఆరోపించారు. రైతుల అభ్యున్నతికి ఏనాడూ కృషి చేయడం లేదన్నారు. నేడు పంట కల్లా లు, వ్యవసాయంలో భా గం కాదనే సాకుతో రూ.151 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, వాటిని తిరిగి చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేం ద్రం నోటీసులు జారీ చేయడం శోచనీయమన్నా రు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేదన్నారు.
రూ.750 కోట్లతో 89 వేల కల్లాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇతర రాష్ర్టాల్లో కల్లాల్లో చేపలు ఎండ బెట్టుకుంటే రాని నిబంధన తెలంగాణలో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు నిర్మించుకుంటే మాత్రం అడ్డొచ్చిందని మంత్రి విమర్శించారు. కేంద్రం ధాన్యా న్ని కొనకుంటే సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో యాసంగి ధాన్యాన్ని కొంటున్నారని.. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని.. తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మారిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఆమె కొనియాడారు.
తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ నేడు జరిగే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోని వచ్చినప్పటి నుంచి రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘చంద్రబాబునాయుడు అధికారం నుంచి దిగిపోయి 20 ఏం డ్లు అవుతున్నది. కొవిడ్ సమయం లో ఈ ప్రాంత ప్రజలను ఒక్కసారి కూడా ఆయన పట్టించుకో లేదు. ఒక్క హైటెక్‌సిటీ బిల్డింగ్ కట్టినంత మాత్ర నా సైబరాబాద్ అభివృద్ధి జరిగినట్లా’ అని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నద న్నారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.