పదేండ్ల పాలనలో బీజేపీ చేసింది ఎందో చెప్పాలి
పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ సమీపంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
షాద్‌నగర్, మార్చి 3 : పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ సమీపంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం ఇచ్చినం, మరుగుదొడ్లు కట్టిచ్చినం, ఈజీఎస్ పనులు చేసినం.. అని చెప్పడం తప్పా తెలంగాణ అభివృద్ధికి చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో ఓట్లు అడుగుతారో బీజేపీ నాయకులు చెప్పాలని అన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని, ప్రజల ఆరోగ్యంపై కనీస శ్రద్ధ చూపలేదని అన్నారు. దేశ ప్రధాని మోదీ, అమిత్‌షా వంటి నేతలు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టారని, తెలంగాణ అమరవీరులను అవమానపర్చారని మండిపడ్డారు. దేశంలో బీజేపీని వ్యతిరేకించే నాయకులపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 90 రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో మంత్రి ప్రయాణం… సీట్ల సమస్యకు పరిష్కారం చూపాలని వినతి
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రయాణికుల వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలించే క్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఉచిత ప్రయాణం ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో సీట్లు సరిపోవడం లేదని, బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు ప్రయాణికులు మంత్రి దృష్టికి తెచ్చారు. త్వరలో బస్సుల సంఖ్యను పెంచుతామని వివరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

