ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 5 : ఈ నెల 9న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర గార్డెన్లో టీఆర్ఎస్ మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి వార్డు నుంచి వందకు పైగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సుమారు రూ. 233 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. బొంగుళూరు ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి బైకుర్యాలీ నిర్వహిస్తున్నందున యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, టీఆర్ఎస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి వేణు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సుల్తాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, రాష్ట్ర నాయకులు బర్ల జగదీశ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాచారం : ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈ నెల 9న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ అధ్యక్షతన శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. యూత్ విభాగం నాయకులు, టీఆర్ఎస్వీ నాయకులు ప్రతి గ్రామం నుంచి బైక్ ర్యాలీని నిర్వహించాలన్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, సుధీర్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్చ భాషా, సర్పంచ్‌లు హబీబుద్దీన్, జగదీశ్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ ,ఉదయశ్రీ, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు శివలీల, ఇస్రత్బేగం, పీఏసీఎస్ డైరెక్టర్లు స్వరూప, శశికళ పాల్గొన్నారు.
మంచాల : ఈనెల 9న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగే వివిధ రకాల అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఎంపీపీ జాటోతు నర్మద అన్నారు. శనివారం మంచాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు వరకు డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ. 38కోట్ల 60లక్షలు, ఎలిమినేడు పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 7కోట్లు, ఆగపల్లి-పెద్దతుండ్ల మధ్యన మిగిలిపోయిన డబుల్‌రోడ్డుకు రూ. 3 కోట్లు మంజూరయ్యాయని, ఆ పనులను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బహదూర్, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ బొద్రమోని యాదయ్య, నాయకులు ఏర్పుల చంద్రయ్య, జంబుల కిషన్‌రెడ్డి, చిందం రఘుపతి, కందాల శ్రీశైలం, హరిప్రసాద్, బాల్‌రాజ్, నాగరాజుగౌడ్, అనిత, సుకన్య తదితరులు పాల్గొన్నారు.