Vikarabad | వికారాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సబ్బండ వర్గాలకు కష్టాలు మొదలయ్యా యి. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన పాలకులు అన్ని వర్గాలను నట్టేట ముంచుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం లో ఉపాధి కోసం జిల్లాలోని పరి గి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు దుబాయ్, ముంబై, పుణె, హైదరాబాద్‌లకు వెళ్లి న పరిస్థితులు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పా టై.. కేసీఆర్ ప్రభు త్వం అధికారంలోకి రాగా నే రైతు సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలను అమలు చేయడంతో వలస వెళ్లిన ప్రజలు తిరిగి తమ సొంతూళ్లకు చేరుకున్నారు. పదేండ్లపాటు ఎలాంటి ఢోకా లేకుండా స్థానికంగానే ఉపాధి పొందుతూ కుటుంబాలతో సంతోషంగా జీవించారు.
కాగా.. 15 నెలల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లి మళ్లీ వలసబాట పడుతున్నారు. కేసీఆర్ హయాంలో పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించడం మొదలుకొని పండించిన పంటనూ కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర ఇవ్వడం.. స్వయం ఉపాధి అవకాశాలతోపాటు సబ్సిడీ రుణాలు అందించడం, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిచ్చారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కూడా సక్రమంగా అమలు చేయడంలేదు. బీఆర్ఎస్ హయాంలో వలసలు ఆగిపోయి సొంతూళ్లలో వ్యవసాయం, స్వయం ఉపాధి పొందితే, రేవంత్ స ర్కార్ 15 నెలల పాలనలోనే ఊర్లకు ఊర్లు ఖాళీ అవుతున్నాయి. పంటల సాగుకు చేసిన అప్పులు కూడా తీర్చలేక ఇంటిల్లిపాది పల్లెలను వదిలి ఉపాధి కోసం ముంబై, పుణె, హైదరాబాద్‌కు మూటాముల్లె సర్దుకొని వలస వెళ్తున్నారు.
గత సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరు తీసుకొచ్చి వలసలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే.. రేవంత్ సర్కార్ మాత్రం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నది. ఫా ర్మా కంపెనీలతోపాటు పలు పరిశ్రమల ఏర్పాటు కోసం ఎకరం, రెండెకరాల భూములు ఉన్న అన్నదాతల నుంచి బలవంతంగా పొలాలను లాక్కుంటుండడంతో రైతులు, ప్రజలు వలసబాట పడుతున్నారు.
పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని తం డాలకు చెందిన వందలాది కుటుంబాలు తమ ఊర్లను వదిలి ఉపాధి కోసం ముంబై, పుణె, హైదరాబాద్‌కు వలస వెళ్లారు. పరిగి సెగ్మెంట్ కులకచర్ల మండలంలోని పలు తండాల్లో చాలా ఇండ్లు జనాల్లేక నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. బిందెంగడ్డతండా, చింతల్‌కుంట తండా తదితర తండాల్లో ఏ ఇంటిని చూసినా తాళాలే కనిపిస్తున్నాయి.
కొం దరు ఇండ్లకు తాళాలు వేసి పిల్లాజెల్లలతో కలిసి వలస వెళ్తే.. మరికొందరు ఇండ్ల వద్ద వృద్ధులను వదిలేసి వెళ్లడంతో.. తినడానికి సరిపడా ఆహారం అందక.. పింఛన్ డబ్బులతో ఒక పూట తిం టూ మరో పూట పస్తులుంటూ తమ కుటుంబ సభ్యులు ఎప్పుడొస్తారో అని వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నా యి. కులకచర్ల, దోమ, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లోని పలు తండా ల్లో వందలాది కుటుంబాలు వలస వెళ్లాయి. అప్పులు తీర్చేందుకు కొడుకులు పూణె వెళ్లారు.
రెండెకరాల పొలం ఉన్నది. నలుగురు కుమారులున్నారు. ఉండేందుకు బం డల ఇల్లు మాత్రమే ఉన్నది. ఉన్న పొలంలో పంటను అప్పులు తీసుకొచ్చి సాగు చేశా. ప్రస్తుతం ఆ అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ హయాంలో రైతుబంధు పెట్టుబడి సాయం సక్రమంగా అందడంతో పంటల సాగుకు అప్పులు తీసుకొచ్చే పరిస్థితి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం సక్రమంగా రాక అప్పులు చేయాల్సి వస్తున్నది. చేసిన అప్పులను తీర్చేం దుకు నా కొడుకులు, కోడళ్లు పూణెకు బతుకుదెరువు కోసం వెళ్లారు. వారి పిల్లలను పెంచుతూ భర్త నేను గ్రామంలోనే ఉంటున్నా.
-నేనావత్ సోనమ్మ, బిందెంగడ్డతండా, కులకచర్ల
కేసీఆర్ హయాంలోనే రైతులకు మేలు జరిగింది..
కేసీఆర్ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు రైతుభరోసా అందించక.. పం ట రుణాలను మాఫీ చేయకపోవడంతో చాలామంది గిరిజనులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. అప్పులను తీర్చే మార్గం లేక మహారాష్ట్రలోని పుణె, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉపాధి లేని కారణంగానే వలసలు పెరిగాయి. బిందెంగడ్డతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బిందెంగడ్డతం డా, చింతల్కుంటతండా నుంచి సుమారు 50కి పైగానే కుటుంబాలు వలస వెళ్లాయి.
– తుల్జానాయక్, బిందెంగడ్డతండా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, కులకచర్ల
జీవనోపాధి కోసమే పుణెకు..
భర్త మరణించి ఐదేండ్లు దాటింది. ఒక కుమారుడు ఉన్నాడు. ఊరిలో గుంట భూమి కూడా లేదు. తినేందుకు తిండి లేక.. ఉం డేందుకు ఇల్లు లేక బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని పుణెకు వెళ్తున్నా. కొడుకును ఇంటర్ వరకు చదివించా. ఉన్న ఇల్లు కూలి పోయింది. కట్టుకునే స్థోమత కూడా లేదు. పుణె నుంచి తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు ఇంట్లో మంచిగా ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఉంటున్నాం. ప్రభు త్వం నుంచి ఇప్పటికీ ఇల్లు రాలేదు.
-జరుప్ల బుజ్జిబాయి, వలస కూలీ, బిందెంగడ్డతండా, కులకచర్ల
అప్పులు తీర్చలేని పరిస్థితి ఉన్నది..
మా కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములం ఉన్నాం. కేవలం మూడెకరాల భూమి మాత్రమే ఉన్నది. దానిని సాగు చేసేందుకు ఇక్కడే ఉన్నా. మిగిలిన ఆరుగురు అన్నయ్యలు బతుకుదెరువు కోసం పుణెకు వలసవెళ్లారు. అప్పులు తీసుకొచ్చి ఉన్న భూమిలో పంటను సాగు చేసినా దిగుబడి రాలేదు. తీసుకొచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. రైతుభరోసా పెట్టుబడి సాయం సమయానికి వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది. చాలాకష్టంగా జీవిస్తున్నా. మిగిలిన కుటుంబ సభ్యులు పండుగల సమయంలో ఇక్కడికి వస్తారు. ఇల్లు చాలా చిన్నగా ఉండడంతో అందరూ ఉండలేని పరిస్థితి.
-జరుప్త సంతోష్, బిందెంగడ్డతండా, కులకచర్ల
కుటుంబాలను పోషించుకునేందుకే..
మా గ్రామంలోని చాలామంది గిరిజనులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అందుకు కారణం ఇక్కడ ఉపాధి లేకపోవడమే. గ్రామంలో పని దొరకక, కుటుంబాలను షోషించుకునేందుకే వలస వెళ్తున్నారు. ఇక్కడ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు న్నా యి. అందరూ గ్రామంలోనే ఉండాలంటే పని దొరకడం లేదు.
– శ్రీనూనాయక్, బిందెంగడ్డతండా, కులకచర్ల