రంగారెడ్డి, జూలై 11 (నమస్తే తెలంగాణ) : పెండింగ్లో ఉన్న బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాదిగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు మధ్యా హ్న భోజనాన్ని అందిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా రూ. మూడు నుంచి రూ.నాలుగు కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని ఎన్నిసార్లు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో కార్మికు లు పోరాటానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే సీఐటీయూ ఆధ్వర్యంలో గురు వారం మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్రహీంపట్నం ఎంఈవో కార్యాలయానికి తాళం వేశారు. తమ బిల్లులు చెల్లించే వరకూ తాళం తీయమని ధర్నా చేపట్టారు.
ప్ర భుత్వం బిల్లులను సకాలంలో చెల్లించకున్నా ప్రధానోపాధ్యాయులు మాత్రం మెనూ ప్రకా రం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని.. వారంలో మూడుసార్లు కోడిగుడ్లు పెట్టాల్సి వస్తున్నదని.. ఇందుకోసం ప్రతినెలా అప్పు లు చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2400 మంది మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు వండి వడ్డించేందుకు పని చేస్తున్నారు.
అదేవిధంగా ప్రభుత్వం సన్నబియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తుండగా..మిగిలిన ఆకుకూరలు, పప్పులు, గుడ్లను అప్పు లు చేసి కొనాల్సి వస్తున్నదని.. ప్రస్తుతం మా ర్కెట్లో ఒక్క గుడ్డు రూ. ఏడు వరకు ఉండగా .. ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలే చెల్లిస్తుండడంతో రెండు రూపాయలను కార్మికులు తమ చేతుల్లోంచి ఇవ్వాల్సి వస్తున్నదని.. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ప్రభు త్వం ఇచ్చే మెనూ ధర ఏ మా త్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిరోజూ విద్యార్థులకు రాగిజావను అందించే వారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ మాటే వినబడడం లేదు.
మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం సుమారు రూ.మూడు నుంచి రూ. నాలుగు కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నది. అలాగే కార్మికుల వేతనాలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఖర్చులను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుండగా.. తొమ్మిది, పది తరగతులకు చెందిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఆ బిల్లులే ఇంకా పెండింగ్లో ఉన్నాయి.
జిల్లాలో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. లేకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపడుతాం.
– స్వప్న, సీఐటీయు నాయకురాలు