వికారాబాద్, ఆగస్టు 28 : స్పీకర్ సొంత నియోజకవర్గంలోనే యూరియా కొరత ఉం డడం దారుణమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మం డిపడ్డారు. గురువారం వికారాబాద్ జిల్లా కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం దగ్గర ఉదయం ఆరు గంటల నుంచే వానలో తడు స్తూ బారులుదీరిన రైతులను ఆయన పరామర్శించి.. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నదాతలపై చూపుతున్న చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసి.. రైతులతో కలిసి క్యూలో నిలబడి నిరసన తెలిపారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి వెళ్లి యూరియా కొరత తీర్చాలని ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి పండుగ రోజు కూడా యూరియా కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి అన్నదాతలకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పొలం పనులను మానుకొని ఉదయం ఆరు గం టల నుంచే క్యూలో నిల్చు న్నా యూరియా దొరుకుతుందనే నమ్మకం లేదన్నారు. కేంద్రం నుంచి రాకపోవడంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రంలో యూ రియా కొరతే లేదని పేర్కొంటున్నారని.. ఇరువురు చెబుతున్నా దానిలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక రైతులు ఆగమవుతున్నారన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడేందుకు వచ్చిందని ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇది కృత్రిమ కొరత అని కాంగ్రెస్ పార్టీ నా యకులే చెబుతున్నారని..కొరత సృష్టించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జిల్లా, స్పీక ర్ నియోజకవర్గంలో యూరియా కొరత ఉం డడం సిగ్గుచేటని అన్నారు. సీఎం, స్పీకర్ దీనిపై సమీక్షించి.. రైతులకు సకాలంలో ఎరువులను అందించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు మాని, రైతులకు సరిపడా ఎరువులను అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చురక అంటించారు.
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారం లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రుణమాఫీ అరకొరగా జరిగిందని, రైతుభరోసా ఊసే లేదని, సబ్సిడీపై అందిస్తామన్న యంత్రాల జాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత ఇలాగే కొనసాగితే కలెక్టరేట్‌తోపాటు అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించా రు. మాజీ ఎమ్మెల్యేతో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షు డు గయాజ్, నాయకులు మల్లికార్జున్, పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లేశం ఉన్నారు.