వికారాబాద్, మే 22 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై బీజేఆర్ చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు బొలెరో వాహనానికి తాడు కట్టి లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియగానే ప్రజలపై కేంద్రం పెట్రో ధరలను పెంచిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి ఓట్లు, సీట్లు తప్ప.. ప్రజల సంక్షేమం పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 30 శాతం వ్యాట్ పెంచడంతో ప్రజలు, రైతులపై మోయలేని భారం పడిందన్నారు.
2014లో పెట్రోల్ ధర రూ.75 ఉంటే ప్రస్తు తం రూ.115లకు.. డీజిల్ రూ. 55 ఉంటే ప్రస్తుతం దాదా పు రూ. 100కు చేరిందన్నారు. 30 నెలల కిందట అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. రైతుభరోసా సక్రమంగా ఇవ్వకుండా అన్నదాతను గోస పెడుతున్నదన్నా రు. గతంలో వికారాబాద్‌లో రోడ్లు బాగాలేవని పిల్లను ఎవ రూ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని.. మరి ఇప్పటివరకు ఎంతమందికి పిల్లలను ఇప్పించారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను బద్నాం చేయడమే తప్పా వికారాబాద్ అభివృద్ధికి, రైతులకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశా రు.
ఎన్నిలకు ముందు వికారాబాద్ ఏ విధంగా ఉన్నదో.. ఇప్పుడూ అలాగే ఉన్నదన్నారు. కాంగ్రెస్ నాయకులు మార్పు అని అన్నారు.. అది ఎక్కడ కనిపించడం లేదే అని ప్రశ్నించారు. ఒక్క అభివృద్ధి పని చేయడం చేతగాని కాం గ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు, రైతులు కోపంతో ఉన్నారన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేవరకు ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామన్నారు. అనంతరం రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాక ముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాటా మాట్లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు యువత ముందుకు కదలిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతోపాటు అందరి రైతుల నుంచి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడల్ వేణుగోపాల్, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్, కౌన్సిలర్లు పాండు, అశోక్, నాయకులు సుభాన్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, మల్లికార్జున్, అంజియ్య, రాంరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మల్లేశం, అనిల్, షఫీ తదితరులు పాల్గొన్నారు.