వికారాబాద్ : తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బంట్వారం మండల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దీనికి ఆనంద్ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు సీనియర్ నాయకుడు ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశాన్ని బంట్వారం మండల పార్టీ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా అశోక్ ముదిరాజ్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అల్లాపురం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఖాజాపాషా, మండల యువజన విభాగం అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌రెడ్డిలను నియమించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చా రు. 16 నెలల కాంగ్రెస్ పాలన చూశాక ప్రజలందరూ మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశా రు.
సమావేశంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, బీ ఆర్ ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణాధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు బల్వంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మర్పల్లి మండలాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు నర్సింహులు, వికారాబాద్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుభాన్‌రెడ్డి, వికారాబాద్ మండలం కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ బల్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.