వికారాబాద్, సెప్టెంబర్ 12 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ బీఆర్ఎస్పార్టీ జిల్లా కార్యాలయంలో మండల ఎస్సీసెల్ అధ్యక్షులు, సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పార్టీ జెండాను ఎగురవేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్, జనరల్ సెక్రటరీ శివకుమార్, మైనార్టీ విభా గం అధ్యక్షుడు గయాజ్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్, మల్లికార్జున్, మండలంలోని గ్రామాల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాల్గొన్నారు.