తాండూరు, డిసెంబర్ 20: బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ దుష్ర్పచారం చేస్తున్నదని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప అన్నారు. మంగళవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ బీజేపీ గుట్టు రట్టు చేసినందుకే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాదంతో నీచ రాజకీయం చేస్తున్న బీజేపీకి ప్రజ లు ఎన్నికల్లో బుద్ధి చెప్పడంతో జీర్ణించుకోలేక దినదినాభివృద్ధి చెందుతున్న బీఆర్ఎస్పై అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై చేసిన అసత్యపు ఆరోపణలను ఖండించారు. రోహిత్‌రెడ్డి ప్రజా సేవ కోసం రాజకీయంలోకి వచ్చాడు తప్ప బీజేపీ నేతల్లా అవినీతి, అక్రమాలు చేయడం లేదన్నారు.
విద్యార్హతలపై తప్పుడు కూతలు కూస్తున్న బీజేపీ నేతలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎలాంటి కేసులు లేనిదే ఉద్దేశపూర్వకంగా ఈడీ నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. బీజేపీ నీచపు బుద్ధి మార్చుకోకపోతే ఇక నేరుగా బుద్ధి చెపుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారు..
పెద్దేముల్, డిసెంబర్ 20: బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కాపాడారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సీనియర్ నాయకుడు నరేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
ఈడీ, ఐటీలను ప్రయోగించి ఎమ్మెల్యేలను లోబర్చుకోవాలని బీజీపీ ప్రయత్నిస్తుందని, అయితే వాళ్ల ప్రయత్నాలు ఫలించవన్నారు. తాండూరు నియోజక వర్గ ప్రజలు రోహిత్ రెడ్డి వెంబడి ఉన్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, భయపడేది లేద న్నారు.
ఓ బీజేపీ నాయకుడు తాండూరు యువతపై తప్పుడు ప్రచారం చేస్తు న్నాడని, మరోమారు తాండూరు యువతపై, రోహిత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రంగయ్య, రైతు సం ఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్,పార్టీ , శిబ్లి, ఉపేందర్ గ్రామకమిటీ అధ్యక్షుడు డీవై ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, రఘు, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు
కక్ష సాధింపులో భాగమే ఈడీ విచారణ
బషీరాబాద్, డిసెంబర్ 20 : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణ జరపడం కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ ఎస్ మండల నాయకులు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రం లో ఈడీ విచారణను ఖండిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాము నాయక్ ఆధ్వర్యంలో విలేకరులసమావేశం నిర్వహించారు.
ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చిన దొంగ స్వా ములను పోలీసులకు పట్టించినందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్న బీజేపీ పెద్దలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తాండూరు ప్రజలు ఎమ్మె ల్యే వెంట ఉన్నంత వరకు ఈడీలు, సీబీఐలు ఏమి చేయలేవని తెలిపారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అల్లాపూరం వెంకట్రాంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రజాక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్టీ సేల్ అధ్యక్షుడు నరేశ్ చహన్, బీసీ సెల్ అధ్యక్షుడు దస్తాయ్య గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణ, సర్పంచ్ సాబేర్ ఉన్నారు.