హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్తున్నది. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకండా రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యానికి అనుమతులిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నది. వైన్స్ షాపుల ఏర్పాట్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోనళలు కొనసాగుతున్నాయి.
తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తిరుమలగిరి లాల్ బజార్ చిన్న కామేలా బస్తీ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న వైన్స్ దుకాణాన్ని తొలగించాలని బస్తీ మహిళలు ఆందోళన చేపట్టారు. వైన్స్ షాప్ ఏర్పాటు చేస్తే ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతాయని మహిళలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. వెంటనే వైన్ షాప్ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.