షాబాద్, డిసెంబర్ 17: ఇంట్లో వాళ్లతో గొడవపడిన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాబాద్ ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకార..షాబాద్ గ్రామానికి చెందిన వడ్ల నందిని(32)ఇంట్లో వాళ్లతో గోడవపడి మనస్థాపం చెంది షాబాద్ పహిల్వాన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
బుధవారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నందిని మృతితో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.