Gold Chain Theft | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 16 : ఓ వ్యక్తి చేసిన అప్పులను తీర్చేందుకు ఏకంగా భార్య మెడలోని బంగారు గొలుసునే దొంగిలించాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ తన భార్య మెడలో బంగారు గొలుసును దొంగిలించి పోలీసులకు చిక్కి చివరకు కటకటాల పాలయ్యాడు.
డీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన ముక్కెర భాగ్యమ్మ (45), ఆంజనేయులు దంపతులు.. కేపీహెచ్‌బీ కాలనీ వసంత నగర్ కాలనీలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆంజనేయులు ఇటీవల ఒక వ్యక్తి వద్ద 30 వేల అప్పు చేశాడు. ఈ అప్పును తీర్చేందుకు మంగళవారం అర్ధరాత్రి తన భార్య భాగ్యమ్మ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని.. అతడే గొలుసును తీసి దాసిపెట్టాడు. మరునాడు ఉదయం ఇంటి ఓనర్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి ఓనర్ మంచితనాన్ని అలుసుగా చేసుకొని.. తన ఇంట్లోనే దొంగతనం జరిగింది కాబట్టి ఇంటి యజమానే భయపడి రెండు తులాల బంగారు గొలుసు ఇస్తాడని భర్త ఆంజనేయులు పన్నాగం పన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొలుసుపోయినట్టు నాటక మాడారు. తీరా విచారిస్తే ఆ గొలుసును అమ్మినట్టు పోలీసులు నిర్ధారించారు. అమ్మిన గొలుసును స్వాధీనం చేసుకొని భర్త ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్