Cherlapally | చర్లపల్లి, జూలై 7 : చర్లపల్లి పారిశ్రామికవాడను రాష్ట్రంలోనే ఆదర్శ పారిశ్రామికవాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చర్లపల్లి పారిశ్రామికవాడ ఐలా చైర్మన్ డాక్టర్ గోవింద్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ భవనంలో పారిశ్రామికవేత్తల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌రెడ్డి, ఐలా, సీఐఏ ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవాడలోని ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల నిర్మాణం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలను అధిగమించేందుకు ఐదు ఫేజ్‌లలో సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
పారిశ్రామికవాడలో జీరో గార్బెజ్లో భాగంగా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, కార్మికుల సంక్షేమంలో భాగంగా మహిళ, పురుషుల హాస్టల్స్‌ను వేరువేరుగా ఏర్పాటు చేయడంతో పాటు క్యాంటిన్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా పారిశ్రామికవాడలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు కన్వేన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పారిశ్రామికవేత్తల సంక్షేమానికి సీఐఏ కృషి చేస్తుంది : సీఐఏ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి
పారిశ్రామికవాడలోని పారిశ్రామికవేత్తలు, కార్మికుల సంక్షేమానికి సీఐఏ కృషి చేస్తుందని సీఐఏ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కార్మికులు, పారిశ్రామికవేత్తలకు ఇన్స్‌రెన్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఎంఎస్ఎంఈ ద్వార ప్రోత్సహాకాలు అందింపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఐఏ ఆధ్వర్యంలో కార్మికులు, పారిశ్రామికవేత్తలు, అన్ని వర్గాల వారి ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఎంఎస్ఎఈ ద్వార పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల ఎగ్జిబిషెన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు న్యాయ సలహాలు, సూచనలు అందించే విధంగా న్యాయ బృందంను ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఐఏ కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్ధిక వనరులు సమకూర్చుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలా మాజీ చైర్మన్ కట్టంగూర్ హరిష్‌రెడ్డి, ఐలా వైస్ చైర్మన్ తాటి శ్రీనివాస్, కార్యదర్శి రాఘవయ్య, సంయుక్త కార్యదర్శి సురేశ్, కోశాధికారి మల్లిఖార్జున్‌రెడ్డి, సీఐఏ కార్యదర్శి పీఎస్.మోహన్, ఉపాధాక్ష్యుడు వై.సుధాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి గంగాధర్‌బాబు, కోశాధికారి శ్రీరాం శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు