Bandari Lakshma Reddy | చర్లపల్లి, మే 18 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ బండారి రాజిరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ హోల్‌సెల్ కూరగాయాల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సంతాప సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబద్దత కలిగిన నాయకుడిగా స్వర్గీయ రాజిరెడ్డి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు కుషాయిగూడ కురగాయాల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ బండారి రాజిరెడ్డి బాటలో నడుస్తూ ఉప్పల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుషాయిగూడ హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్ కమిటీ సభ్యులు సాయిబాబా యాదవ్, దేవేందర్‌గౌడ్, ఆశోక్‌గౌడ్, బాబు గౌడ్, తిలక్, బాబ్లు, వెంకటేశ్, రఘుగౌడ్, అంజి, రహీంలతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్