MLC Shambipur Raju | దుండిగల్, ఏప్రిల్ 9 : నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభకార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని ఆయనకు పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ