World Water Day | దుండిగల్, మార్చి 22 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం ”ప్రపంచ జల దినోత్సవంసస(వరల్డ్ వాటర్ డే) నిర్వహించారు. ”యూత్ ఫర్ సేవ” వాలంటీర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి సద్వినియోగం, నీటి కాలుష్య నివారణ, వాన నీటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాణవాయువు తరువాత నీరే మనకు ప్రాణాధారమని, మనకున్న నీరు పరిమితమని, జలాన్ని వృధా చేయకుండా పరిమితంగానే వాడుకుందామని, వాననీటిని సంరక్షిద్దామని, నీటి వనరులను కాలుష్యం నుండి కాపాడుకుందామని పిలుపునిచ్చారు
అనంతరం ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పిచ్చుకలు, ఇతర పక్షుల నీటి అవసరాలకై నిజాంపేట కార్పోరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలోని చెట్లకు నీటి కుండీ(ఉట్టి)లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఆ కుండీలలో నీరు నింపడం జరుగుతుందన్నారు. మన ఇళ్ల దగ్గర కూడా మనమందరం పక్షులకు నీటి కోసం ఉట్టి(కుండీ) పెడదామని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవ వాలంటీర్లు డా. ఎమ్ఆర్ఎస్. రాజు, శ్రీనివాస్ భరత్ ముఖ్, సత్య కాటేపల్లి, కల్యాణి, భారతి, రామ నారాయణ, లక్ష్మీ రామారావు, నవీన్ చంద్ర, మధు, శ్రీనివాస్, సూర్యనారాయణ తదితర స్వయంసేవకులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.