కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు
తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలో అతి పురాతన ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం. ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా మే, జూన్( మొలకల పున్నం నుంచి ఏరువాక వరకు) నెల రోజుల పాటు జాతర వైభవంగా నిర్వహిస్తారు.
- రూ. కోటితో రేణుక ఎల్లమ్మ ఆలయ పునర్మినిర్మాణం
- భారీగా భక్తుల రాక
- పెరిగిన హుండీ ఆదాయం
తాండూరు రూరల్, నవంబర్ 27: తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలో అతి పురాతన ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం. ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా మే, జూన్( మొలకల పున్నం నుంచి ఏరువాక వరకు) నెల రోజుల పాటు జాతర వైభవంగా నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రం లోని బీదర్, కలబురిగి, సేడం, వాడీ, బెంగళూరు, చించోలి మహారాష్ర్టలోని షోలాపూర్ తదితర ప్రాం తాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా రాష్ట్రంలోని మహ బూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ నుంచి భక్తులు వస్తుంటారు. ఆలయాన్ని సందరర్శించడానిక రైలు, బస్సు సౌకర్యం ఉంది. తాండూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రైలు సౌకర్యం ఉంది. అదేవిధంగా తాండూరు నుంచి చించోలి వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, హైద రాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు రైలు మార్గం ద్వారా తాండూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో కొత్లాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి చేరుకుం టా రు. తాండూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతీ 20 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉం టుంది. ఆలయాన్ని కర్నాటక మంత్రి అరవింద లింబవలి రూ. కోటి వ్యయంతో ఆలయాన్ని పునర్మిర్మాణం చేయించాడు. ఆల యం నాలుగు వైపుల పెద్ద ముఖద్వారాలను నిర్మించడంతోపాటు ప్రాంగాణాన్ని విశాలం గా చేయించారు. ఈ దేవాలయం రాజకీయ నాయకులకు సెంటిమెంట్‌గా నిలిచింది. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ఎన్నికల సమ యంలో ప్రచారం మొదలు పెట్టాలంటే అ మ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హిస్తారు. అంతేగాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అమ్మవారి దర్శనం కో సం వస్తుంటారు. నూతన దంపతులు అమ్మ వారినీ దర్శనం చేసుకోడం ఆనవా యితీ. అమ్మవారికి ముక్కుపుడక, నూతన వస్త్రా లతోపాటు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మరి కొంత మంది యా టలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. జాతర సందర్భంగా ముడు పులు, హుండీ ఆదాయం భారీగా వస్తుంది. ఆ నెల రోజుల పాటు తాత్కాలిక షెడ్లు ఏర్పా టు చేస్తే బాగు టుందని భక్తులు అభిప్రాయపడు తున్నారు. పొలాల్లో వంటవార్పు చేసు కోవాల్సి వస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా ఆలయ పాలక మండలి, దేవా దాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చించోలి తాలుకా చిమన్చెడ్కి చెందిన గుండప్ప అనే భక్తుడు తెలిపారు. తమ ఇలవేల్పు అయిన అమ్మవారి దర్శనం కోసం ప్రతి ఏటా వస్తామన్నారు
అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం
ఆమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదేవిధంగా జాతర సంద ర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాయంతో షెడ్లు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– సందీప్‌రెడ్డి ఆలయ చైర్మన్
అమ్మవారి ఆదాయం పెరిగింది..
గ్రామ పంచాయతీ తరపున అన్ని వసతులు కల్పించే బాధ్యత తీసుకున్నాం. గతంలో కంటే అమ్మవారి ఆదాయం పెరిగింది. ప్రత్యేకంగా బ్యాం కు అకౌంట్ తీసి హుండా లెక్కింపు సమ యం లో వచ్చిన ఆదాయం డబ్బులు, బంగారాన్ని బ్యాంకులో డిపా జిట్ చేస్తున్నాం. – సాయిలు, సర్పంచ్, కొత్లాపూర్
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

