కొండాపూర్, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9న ‘విజయ్ దివాస్’గా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని మంగళవారం ఆమె చందానగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి మాజీ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ సామా వెంకట్ రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి, కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, పింక్ బెలూనన్లు గాల్లోకి ఎగరేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విజయ్ దివస్ చరిత్రలో నిలిచిపోయే రోజని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందన్నారు.
60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక రూపం తీసుకోచ్చిందని, అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్నంది శ్రీకాంత్, వాలా హరీష్, సంగారెడ్డి, కిరణ్ యాదవ్, అల్లావుద్దీన్, రామకృష్ణ గౌడ్, ప్రకాష్, సలీం, బాల్ రాజ్, బాబు మల్లేష్, రాజు, గణేష్ రెడ్డి, గౌస్, వంశీ, శ్రీను, శివ, సునీత, శభనా, అనంత రెడ్డి, మలేష్, గిరి, అష్రాఫ్, నగేష్ రెడ్డి, బాబా, జె. వి.రావు, దొంతి చిన్న, రాజ్ కుమార్, గిరి, ఉపేందర్ లు పాల్గొన్నారు.