కుత్బుల్లాపూర్, జూలై 9: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఒక్కరోజు కోర్టుకు వెళ్లి సినిమా చూసి ఎంతో కొంత అపరాధ రుసుము చెల్లిస్తే బయట పడొచ్చు అనుకుంటే పొరపాటే. కానీ అత్వెల్లి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన శిక్ష అంతా ఇంత కాదు. రెండు రోజుల పాటు ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద పట్టుబడిన వ్యక్తులతో రెండు రోజుల పాటు తాగి వాహనాలు నడపరాదు, హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా గమ్య స్థానాలు చేరాలి అంటూ ప్ల కార్డులు పట్టుకొని ప్రదర్శన చేయాల్సిందే.
ఇక అంతటితో ఆగకుండా ప్రధాన రోడ్లు గుంతలు పడితే మట్టితో పూడ్చాల్సిందే. ఇదే పరిస్థితి అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు బుధవారం సుచిత్ర చౌరస్తా వద్దా ట్రాఫిక్ సీఐ ఏ నాగరాజు నేతృత్వంలో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించి ప్రయాణికులందరూ తాగిన స్థితిలో మీ వాహనాన్ని నడపవద్దని నేను అభ్యర్థిస్తున్నాను అంటూ ప్లకార్డులతో అవగాహన కల్పించారు.