Traffic Awareness | కుత్బుల్లాపూర్, జూన్ 19 : ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌పై అవగాహన కలిగి ఉండి రోడ్డు ప్రమాదాలను నివారించుకునేందుకు బాధ్యతాయుతంగా ముందుకు రావాలని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి కోరారు. గురువారం మేడ్చల్ దేవరయాంజల్లో అల్వాల్ ట్రాఫిక్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతోపాటు గ్రామస్తులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మైనర్లకు ఎలాంటి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదన్నారు. అలాంటి మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఏ నాగరాజుతోపాటు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు