Job Mela | మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 1 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణావకాశం. ఉపాధి కల్పన లక్ష్యంగా జిల్లా మేడ్చల్ ఐటీఐ కాలేజీలో రేపు (ఆదివారం నాడు) జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి ఎం.రాధిక తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డొప్లొమో, డిగ్రీ పాసైన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. అయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతీయువకులు మాత్రమే ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 73868 09422, 98664 65024 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.