LRS Scheme | శామీర్‌పేట, మార్చి 3 : ఎల్ఆర్ఎల్ స్కీమ్‌లో ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ(తగ్గింపు)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సూచించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెంకటగోపాల్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్స్ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఎంఏయూడీ నియమ నిబంధనలు అధికారులకు, మున్సిపాలిటీలోని వివిధ డెవలపర్స్‌కి వివరించడం జరిగిందని పేర్కొన్నారు. జీవో ప్రకారం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై 25 శాతం రాయితీ కల్పించిందని చెప్పారు. మున్సిపల్ పరిధిలో విస్తృత స్థాయిలో ప్రచారం, కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రొహిబుటెడ్ ల్యాండ్స్, వాటర్ బాడీస్‌కి 200 మీటర్లకు బయట ఉన్న వాటిని తక్షణమే గుర్తించి మార్చి 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు, వార్డు అధికారులకు ఆదేశించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో సెక్షన్ల అధికారులు, అసిస్టెంట్లు, వార్డు అఫీసర్లు, ఆపరేటర్లు, ఆర్పీలు, డెవలపర్స్ పాల్గొన్నారు.