మేడ్చల్, ఫిబ్రవరి22(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో వానాకాలంలో సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా 5,453 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది.
అయితే ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన క్రమంలో రైతులు రైస్ మిల్లర్లకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లను విక్రయించారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు డబ్బులతో పాటు బోనస్ డబ్బులు అందిస్తామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో కొనుగోలు చేసిన సన్న వడ్లకు రూ. 42 లక్షల బోనస్ చెల్లించాల్సి ఉండగా ఇందులో సగం మంది రైతులకు మాత్రమే బోనస్ చెల్లించారు. మిగతా రైతులకు రూ. 22 లక్షలు చెల్లించాల్సి ఉంది.