MLA banadari Laxma reddy | మల్లాపూర్, మే 28 : తెలంగాణ రాష్ట్రసాధనలో జర్నలిస్టు ఫోరం పాత్ర చారిత్రాత్మకమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 31న హైదరాబాద్లోని జల విహార్లో నిర్వహిస్తున్న 25 వసంతాల రజతోత్సవాల సంబురాల పోస్టర్లను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నాయకత్వంలో రజతోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) 143 మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ అమరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్ గౌడ్ కాప్రా సర్కిల్ అధ్యక్షుడు గోపాల్ గౌడ్, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ 28 జిల్లా టీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు కాప్రా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దొమ్మాటి కిరణ్ కుమార్, సత్యనారాయణ, రాజేష్ రాము శ్రీకాంత్ నరేష్ కృష్ణ శ్రీను సురేష్ నాగేంద్రబాబు మాజీ కృష్ణంరాజు హరిబాబు. తదితరులు పాల్గొన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు