మల్కాజిగిరి, ఫిబ్రవరి 28: సైన్స్, వైజ్ఞానిక రంగాలలో విద్యార్థులు రాణించాలని ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం అల్వాల్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనకు అల్వాల్ పరిసర ప్రాంతాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైన్స్‌కు ఆరాధ్యుడు అయిన సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకొని విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థుల తెలివితేటలను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు . పేద విద్యార్థుల చదువుల కోసం తన వంతు చేయూతనిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా కిశోర్ , రమేశ్, అనిల్ కిశోర్ , యాదగిరి గౌడ్, పవన్ కుమార్, చరణ్ గిరి, శ్రీనివాస్, అరుణ్, మల్లేశ్, హనుమంతు, టీచర్స్ మేరీ, రాధిక, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.