బాలానగర్, మే 3 : తండ్రి కంటనీరు రాకుండా వారి ఆశయ సాధన కోసం ఉన్నతంగా చదవాలని విద్యార్థులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్లోని రెయిన్బో హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాల్లో 581 మార్కులతో మండల టాపర్గా నిలిచిన ఎస్.రిషితకు రూ.10వేలు నగదు ప్రోత్సాహకంగా పాఠశాల యాజమాన్యం అందజేసింది. రెండో టాపర్గా నిలిచిన జ్యోతిక, ప్రజ్ఞలకు రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేసింది. అనంతరం టాపర్గా నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. 2024 – 25 సంవత్సరంలో ఓల్డ్ బోయిన్పల్లిలోని రెయిన్బో స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబరిచారని ప్రశంసలు కురిపించారు. విద్యార్థుల ప్రతిభ తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. తల్లిదండ్రులు కాయకష్టం చేసి తన పిల్లలను చదివిస్తున్న సందర్భంలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం వారి జీవితాలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ జీవితాలను నెరవేర్చుకోవాలని సూచించారు.
పవర్ లిఫ్టింగ్ సాధనతో దేహదారుఢ్యం
పవర్ లిఫ్టింగ్ సాధనతో దేహదారుఢ్యం లభించడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని భాగ్యశ్రీ గార్డెన్లో ఏర్పాటుచేసిన పవర్ లిఫ్టింగ్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి యువత సమయాన్ని వృథా చేయకుండా వ్యాయామం చేయడం ద్వారా దేహదారుఢ్యం పెంపొందించుకోవడం ఎంతో అవసరం అన్నారు.