ఉప్పల్ నవంబర్ 2 : మురుగు శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం చేపట్టవద్దని, ఇప్పటికే రక రకాల కాలుష్యాలతో ఇబ్బంది పడుతున్నామని ఉప్పల్ శివారు కురుమనగర్, లక్ష్మీనర్సింహ కాలనీ ప్రాంతవాసులు ఆదివారం ఉప్పల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మట్లాడుతు ఎస్టీపీ నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని, కాలనీవాసులకు ఇబ్బందులు కలగకుండ సంబంధిత అధికారులు గుర్తించి మూసీ సమీపంలో నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.