Sports | దుండిగల్, ఏప్రిల్ 20 : సూరారంలోని ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన స్పోర్ట్స్ ఈవెంట్కు మంచి స్పందన లభించింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బోధన సిబ్బంది ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు జట్లుగా ఏర్పడగా.. ప్రత్యేకంగా వీరి కోసం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు, త్రోబాల్ పోటీలను నిర్వహించారు.
విద్య, క్రీడల సమన్వయం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ ఈవెంట్లో భాగంగా పాల్గొన్న బోధన సిబ్బంది, తల్లిదండ్రులు ఐరిస్ రైజర్స్, ఐరిస్ తుఫాన్, ఐరిస్ థండర్స్, ఐరిస్ పాంథర్స్, ఐరిస్ స్టార్స్ గా ఏర్పడి పోటీ పడగా.. క్రికెట్ మ్యాచ్లో ఐరిస్ థండర్స్ విజేతలుగా నిలిచారు.
ఐరిస్ స్టార్స్ రన్నర్స్ స్థానం దక్కించుకుంది. త్రో బాల్ పోటీల్లో మాతృ శక్తి జట్టు విజేతగా నిలిచింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఐరిష్ విద్యా సంస్థల చైర్మన్ శిరీష్ తుర్లపాటి, డైరెక్టర్ రాధికా తుర్లపాటి హాజరయ్యారు.
విజేతలకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తులసీ కుమారి నందా, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ శ్రీనివాస్ తో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?