KPHB Colony | కేపీహెచ్బీ కాలనీ : జేఎన్టీయూహెచ్ వర్సిటీలో సంత్శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ మాధవి కుమారి, మెకానికల్ విభాగం హెచ్ఓడీ రాంజీనాయక్ ప్రారంభించారు. మొదట సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సమాజానికి అందించిన సేవలు గొప్పవని తెలిపారు.
జయంతి సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం రిజిస్ట్రార్ అన్నారు. విద్యార్థులకు క్రికెటర్, చెస్, క్యారమ్, షాట్పుట్, త్రో బాల్, హ్యాండ్బాల్, వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బంజారా విద్యార్థి సంఘం చైర్మన్ ధరావత్ నరేందర్ నాయక్, వ్యవస్థాపకులు భూక్య రాజ్ కుమార్, పూర్వ విద్యార్థులు భాను ప్రకాశ్ నాయక్, వర్సిటీ బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షుడు ధరావత్ వినోద్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకాశ్ నాయక్, సిద్ధార్థ, శశి కుమార్, గౌతమ్, సురేష్, జీవన్, మోహిత్, రాహుల్, తిరుపతి, ప్రణీత, అనూష, లైలా, సంధ్య, వైశాలి పాల్గొన్నారు.