GHMC Parks | మల్లాపూర్, మార్చి 17 : మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ పార్కుల్లో స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేటర్ జే ప్రభుదాస్ అన్నారు. ఇవాళ డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్కులో అభివృద్ది, మరమ్మత్తు పనుల దృష్ట్యా ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ.. రాజీవ్ పార్క్‌లో పాడైనటువంటి జిమ్ పరికరాల స్థానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
చెట్ల చుట్టు ఉన్నటువంటి కొమ్మలు తొలగించి శుభ్రం చేయడంతోపాటు పూర్తిగా పచ్చదనం కండ్లకు కనువిందుగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. పార్కును పూర్తిగా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ లోకేష్, ఏఈ లింగారావ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు