Land Issues | మేడ్చల్, జూన్ 12 : భూ సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం మేడ్చల్ మండలంలోని శ్రీ రంగవరం, అత్వెల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే ఆన్లైన్లో నమోదు చేయాలని, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే క్షేత్రస్ధాయిలో పర్యటించి పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు ఏవిధంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అర్జీలను నిర్ధేశిత కోడ్లలో నమోదు చేయాలని, రైతులకు సంబంధిత డాక్యుమెంట్లను జతచేయాలని తెలియజేయాలన్నారు. అర్జీదారులతో సౌమ్యంగా మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలను అందించాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు దృష్టికి వస్తే పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దారు సునీల్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్