మేడ్చల్ కలెక్టరేట్, జూలై 19 : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించుకోవాలని ఎస్ఐ హరిప్రసాద్ అన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి కేజీఆర్ కళాశాలలో శనివారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలసి కళాశాల చైర్మన్ కె.గోవిందరెడ్డి, ఎస్ఐ హరిప్రసాద్ మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ నేడు మనం నాటే మొక్కలు రేపు పర్యావరణాన్ని కాపాడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ పి.వి. రమణారావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. విజయలక్ష్మి, ప్రొఫెసర్ జి. విజయ్‌కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కె.ఎస్. రాజశేఖర్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.