Oyo | మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 23: ఓయో రూమ్ ఎదుట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి గ్రామానికి చెందిన షిరిడిసాయి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఓయోను తీసేయాలని డిమాండ్ చేశారు.
షిరిడిసాయి కాలనీలో ఏర్పాటు చేసిన ఓయో రూమ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై స్థానికులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ మధ్యలో ఓయో రూమ్ ఉండటంతో ఈ మార్గం గుండా వెళ్లే మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ఓయోను అక్కడి నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయో రూమ్ ఎదుట ధర్నా చేశారు. దీనిపై మున్సిపల్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.