జవహర్‌నగర్, జనవరి 5 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను(Labour Codes) రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్షావలి డిమాండ్ చేశారు. కార్మికుల పొట్టకొడుతూ తీసుకువచ్చిన నాలుగు నల్లచట్టాలను వ్యతిరేకిస్తూ సోమవారం మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనర్ కలెక్టర్ విజయేంద్రరెడ్డికి షేక్షావలి వినతిప్రతం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్, అధిపత్య ఆర్థిక విధానాలకు రెడ్ కార్పెట్ పరుస్తూ, అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వాటిని ప్రజా క్షేత్రంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసరాలను అరికట్టి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అందజేయాలని, విధినిర్వహణలో ఉద్యోగులు మరణిస్తే 50వేల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెష్, సునీత, తదితరులు పాల్గొన్నారు.