Kukatpally Nalla cheruvu | కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 17: కూకట్ పల్లి నల్లచెరువును మరోసారి సర్వే చేసి… చెరువు విస్తీర్ణం, బఫర్, ఎఫ్టీఎల్ జోన్లను గుర్తించాలని, రైతు కుటుంబాలు నష్టపోకుండా ఆదుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను నల్లచెరువు బాధిత రైతు కుటుంబాలు కోరుతున్నాయి. నిజాం కాలం నుండి ఉనికిలో ఉన్న నల్లచెరువు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొని, చేపలు, లాంటి పలు ఆధారిత పనులతో గ్రామంలోని కుటుంబాలు జీవించేవారని తెలిపారు. కొద్దికాలం క్రితం వరకు చెరువు పరిసరాల్లో పంటలు పండించుకునే వారమని… చెరువు సుందరీకరణలో భాగంగా అధికారులు మట్టిని పోయడంతో ప్రస్తుతం పంటలు వేయడం లేదని రైతులు తెలిపారు.
కాలక్రమేనా చెరువు పరిసర ప్రాంతాల్లో రామయ్య నగర్, ప్రకాష్ నగర్, దేవి నగర్, గాయత్రి నగర్, శేషాద్రి నగర్, లక్ష్మీ నగర్ లాంటి కాలనీలు ఏర్పడ్డాయి అన్నారు. కాగా 2010లో నిర్వహించిన సర్వే ప్రకారం చెరువు విస్తీర్ణం 19 ఎకరాలు మాత్రమేనన్నారు. తదనంతరం చెరువు అలుగును 120 ఫీట్ ల నుంచి 20 ఫీట్లకు కుదించారని… అక్కడే ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ ను నిర్మించారని, మరోవైపు పార్కును ఏర్పాటు చేశారని తెలిపారు.
చెరువు కట్ట ఎత్తును పెంచి, కట్టను వెడల్పు చేయడం వల్ల చెరువు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రస్తుతం అధికారులు చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుగా పేర్కొనడం సరికాదు అన్నారు. చెరువు విస్తీర్ణం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లపై మరొకసారి సర్వే నిర్వహించాలని అధికారులను కోరారు. అలాగే చెరువులో కేవలం 7.3 ఎకరాల స్థలం మాత్రమే ప్రభుత్వ భూమి ఉందని.. మిగిలిన పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించాలని, బాధిత రైతు కుటుంబాలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు