MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 5 : ఆర్యూబీ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మచ్చబొల్లారం డివిజన్ తుర్కపల్లిలో జరుగుతున్న ఆర్యూబీ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రైల్వే గేట్ల వద్ద వల్ల వాహనదారులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.
రైల్వే అధికారులతోపాటు జీహెచ్ఎంసీ అధికారులతో రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్‌ను సర్వే నిర్వహించి ఆర్‌యూబీలను నిర్మించాలని ప్రతిపాదించామని అన్నారు. రైల్వే, జీహెచ్ఎంసీ అధికారుల ప్రతిపాదనలను రైల్వే శాఖకు పంపించామన్నారు. ప్రస్తుతం తుర్కపల్లి గేటు వద్ద ఆర్యూబీ నిర్మాణానికి ఆమోదం తెలపడంతో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైల్వే ప్రాజెక్టు అధికారులు హుస్సేన్, ఎస్సీ రవిప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, ఈఈ శ్రీకాంత్, డి ఈలు రఘు, రవళి, మురళి, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, డోలి రమేష్, అనిల్ కిషోర్, శోభన్ బాబు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యూబీ నిర్మాణం కోసం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే పరిశీలన
నేరేడ్మెట్, జూన్ 5: గౌతంనగర్ ప్రజలకు రైల్వే చక్రబంధం నుండి విముక్తి కలిగించడానికి గౌతంనగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం రైల్వే, జీహెచ్ఎంసీ, జలమండలి, ప్రాజెక్టు అధికారులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్‌తో కలిసి ఆర్యూబీ నిర్మాణాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు సమన్వయం చేసుకొని త్వరలో ఆర్యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దకాలంగా నెలకొన్న రైల్వే గేట్ సమస్య నుంచి త్వరలో ప్రజలు విముక్తి చెందుతారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రవిప్రకాష్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డీఈ సుదర్శన్, ఎలక్ట్రికల్ లైన్మెన్ రమేష్, జలమండలి జీఎం సునీల్‌కుమార్, ఏఈ నవీన్, లౌక్య, నాయకులు మేకల రాముయాదవ్, జేఏసీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు