Rayalaseem University | కాప్రా/మల్లాపూర్, ఫిబ్రవరి 23: కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బసవరావు నియమితులయ్యారు. దీనిపట్ల ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ తిరుమలానగర్‌లోని బసవరావు నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మీర్పేట్ హెచ్‌బికాలనీ డివిజన్ కార్పొరేటర్ జే.ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వెళ్లారు.
అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ బసవరావు మూడు దశాబ్దాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేశారన తెలిపారు. బసవరావు రాయలసీమ యూనివర్సిటీ వీసీగా నియమితులవ్వడం గర్వంగా ఉందని అన్నారు. కార్పొరేటర్ జే. ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని కాలనీల అభివృద్ధిలో ప్రొఫెసర్ బసవరావు సూచనలు, సలహాలతో ముందుకెళ్లేవారమని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ భాస్కర్, చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షులు పద్మారెడ్డి, స్థానిక కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మల్లేశ్, అమర్, ఇతర ప్రతినిధులు దాసు, శేఖర్, వేణు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.