Crimes Prevention | ఉప్పల్, ఏప్రిల్ 15 : చిల్కానగర్ డివిజన్ బాలాజీ ఎంక్లేవ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
బాలాజీ ఎంక్లేవ్ కాలనీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి అభ్యర్థన మేరకు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, పోలీస్ సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాలనీలో జరుగుతున్న సైకిళ్లు, పెట్రోల్ దొంగతనాలకు, మందుబాబుల ఆగడాలు, పార్కులలో గంజాయి సేవించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న విషయంపై సమావేశం ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేసి చోరీల నివారణకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పోలీసులను కోరారు.
గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు..
ఈ కార్యక్రమానికి హాజరైన ఉప్పల్ అడ్మిన్ ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. చోరీల నివారణకు కచ్చితంగా పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, చోరీల నివారణకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. అదే విధంగా గంజాయిని అరికట్టే విషయంలో పోలీసులు మఫ్టీలలో తిరుగుతూ ఉన్నారని, గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 కాలనీల సమైక్య అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చిన్న చిన్న దొంగతనాలు అరికట్టకపోతే అవి మునుముందు పెద్ద దొంగతనాలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
పోలీసులతోపాటు సంక్షేమ సంఘం సభ్యులు కూడా తమ వంతు బాధ్యతగా అనుమానిత వ్యక్తులను చూసిన వెంటనే పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా గంజాయి సేవించే వ్యక్తులను గమనిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చి సామాజిక బాధ్యతగా సమాచారం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ ఎంక్లేవ్ కాలనీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ఓంకార్ సింగ్, కమిటీ సభ్యులు కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్