మేడ్చల్, సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. వినాయక మండపాల వద్ద ఉన్న యువకులపై రాత్రిపూట దాష్టీకంగా లాఠీచార్జ్ చేశారు. గల్లీల్లో యువకులను పరుగెత్తించి కొట్టారు పోలీసులు. యువకులు భయంతో పరుగెడుతున్న దృశ్యాలు, పోలీసులు వాళ్లను లాఠీతో కొడుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.
పోలీసుల అర్ధరాత్రి జరిపిన అకస్మిక దాడిలో అస్లాం(31), సంతోష్(28) అనే ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఈ విషయంపై సురారం ఎస్.హెచ్ఓను సంప్రదించగా అసలు పోలీసులు లాఠీచార్జినే చేయలేదని చెప్పారు. కానీ, సీసీ టీవీ ఫుటేజీ చూసిన స్థానికులు పోలీసుల దాడిని ఖండించారు. గణేశ్ మండపాల వద్ద ఉన్న యువకులపై అర్ధ రాత్రి దాడిచేయడాన్ని తప్పుబట్టారు.