కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి19: విద్యుత్ షాక్ తో ప్లంబర్ మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వుడ్స్ కాలనీ లోని బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంది. భవనంలో ప్లంబింగ్ పని కోసం అంబర్ పేట్ కు చెందిన అయాన్ ఖాన్(22) నాలుగవ అంతస్తులో ప్లంబింగ్ పనులు చేసేందుకు వచ్చాడు. కాగా కింది అంతస్తు నుండి కరెంటు వైర్ ను పైకి తీసుకొని పని చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ డ్రిల్లింగ్ మిషన్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. నిర్మాణ సూపర్ వైజర్ మోహిన్ ఖాన్ ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోకపోవడం కారణంగా మృతి చెందాడని మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.