హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): జాతీయ సైన్స్ డే వేడుకల్లో భాగంగా గురువారం ఫోరం ఆఫ్ సైన్స్ టీచర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్సీఈఆర్టీలో రాష్ట్రస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో మంచిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన అనన్య మొదటి స్థానం సాధించింది.
భువనగిరిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలకు చెందిన శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా జక్కాపూర్ జడ్పీ స్కూల్‌కు చెందిన జశ్విత్రెడ్డి సంయుక్తంగా ద్వితీయస్థానం సాధించారు. అలాగే మెదక్ జిల్లా కూచంపల్లి జడ్పీ స్కూల్‌కు చెందిన జీ కీర్తన, సిద్దిపేట జిల్లా రామ్‌సాగర్ జడ్పీహెచ్ఎస్కు చెందిన ఎం శ్రీనిధి సంయుక్తంగా తృతీయ స్థానంలో నిలిచారు.
ఈ టాలెంట్ టెస్ట్‌లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ముగ్గురు చొప్పున విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎన్సీఆర్టీ సంచాలకులు జీ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.